Hyderabad: HMDA Begins Rajiv Swagruha Flats Allotment Process - Sakshi
Sakshi News home page

Bandlaguda: రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన

Jun 27 2022 5:01 PM | Updated on Jun 27 2022 6:22 PM

Hyderabad: HMDA Begins Rajiv Swagruha Flats Allotment Process - Sakshi

బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

సాక్షి, హైదరాబాద్‌: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. 

సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్‌ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్‌బుక్, యూట్యూ బ్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్‌కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్‌ ఫ్లాట్స్‌ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.  (క్లిక్‌: పబ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు)

Advertisement
 
Advertisement
Advertisement