Hyderabad Fire Accident: మలక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం

సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరహత్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ)