హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఎల్‌ శర్మన్‌  | Hyderabad District: L Sharman Appointed As Collector | Sakshi
Sakshi News home page

Hyderabad: జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎల్‌ శర్మన్‌ 

Aug 12 2021 8:08 AM | Updated on Aug 13 2021 9:45 AM

Hyderabad District: L Sharman Appointed As Collector - Sakshi

విదేశాలకు శ్వేతా మహంతి.. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఎల్‌ శర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా శ్వేతా మహంతి స్థానంలో ఎల్‌ శర్మన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శ్వేతా మహంతి అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విధుల నుంచి రిలీవ్‌ అయ్యేందుకు అనుమతిస్తూ.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న 2005 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శర్మన్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. కాగా గురువారం హెదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఎల్‌. శర్మన్‌  బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి కలెక్టర్‌ శ్వేతా మహంతి విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రిలీవ్‌ కావడంతో నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌ బదిలీపై ఇక్కడికి వచ్చారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికారు.  

అదే విధంగా... మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా ఉన్న శ్వేతా మహంతిని ఆ బాధ్యతల నుంచి కూడా రిలీవ్‌ చేశారు. మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ హరీశ్‌కు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్వేతా మహంతి గురువారం విదేశాలకు ప్రయాణం కానున్నారు. 

చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement