Hyderabad Crime: Balapur Missing Woman Killed For Ornaments, Details Inside - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ‘మిస్సింగ్‌ బాలమ్మ’ దారుణ హత్య.. శవం దొరక్కుండా ఏం చేశారంటే..

Dec 27 2022 4:57 PM | Updated on Dec 27 2022 6:46 PM

Hyderabad Crime News: Missing Woman Killed For Ornaments - Sakshi

కనిపించకుండా పోయిన నెల రోజుల తర్వాత బాలమ్మ ఘోరంగా హత్యకు..

సాక్షి, హైదరాబాద్‌: బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మిస్సింగ్‌ కేసులో బాధితురాలిని దారుణంగా హతమార్చినట్లు తేలింది. శవం దొరక్కుండా ఉండేందుకు.. విడి భాగాలను కాల్చేసి ఆ బూడిదను డ్రైనేజీలో కలిపారు నిందితులు. 

ఈ మేరకు నిందితులను రాములు, లలితగా గుర్తించారు. బొర్ర బాలమ్మ అనే మహిళ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఈ క్రమంలో ఆమె హత్యకు గురైనట్లు సోమవారం ధృవీకరించారు పోలీసులు.

బాధితురాలిని హత్య చేసి ఆమె నుంచి నగలను దోచుకున్నారు నిందితులిద్దరూ. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి.. కాల్చేసి ఆ బూడిదను మురికి కాలువలో కలిపేశారు. దర్యాప్తు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారం, 159 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement