హాస్టల్‌లో ఉండలేక.. పారిపోయేందుకు ప్రయత్నం | Hyderabad college accused of negligence in student death due to electrocution | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో ఉండలేక.. పారిపోయేందుకు ప్రయత్నం

Jun 22 2024 6:09 AM | Updated on Jun 22 2024 6:09 AM

Hyderabad college accused of negligence in student death due to electrocution

హయత్‌నగర్‌ (హైదరాబాద్‌): కళాశాల హాస్టల్‌లో ఉండలేక గోడదూకి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఓ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ర్యాంకుల కోసం విద్యార్థులపై కార్పొరేట్‌ యాజమాన్యాల ఒత్తిడికి నిదర్శనంగా నిలిచిన ఈ హృదయ విదారకమైన సంఘటన గురువారం హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో వెలుగులోకి వచి్చంది. తెనాలికి చెందిన ఎ.విజయ్‌కుమార్‌ వ్యాపారం చేసుకుంటూ నగరంలోని ఈస్ట్‌ మారేడ్‌పల్లిలో నివాసముంటున్నారు.

ఆయనకు ఓ కొడుకు, కూతురు సంతానం. కొడుకు గిరీశ్‌కుమార్‌ (15)ను ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివించేందుకు పది రోజల కిందట హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని కోహెడ వద్ద ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో చేర్పించాడు. ఇక్కడ చదవడం ఇష్టం లేని విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో రెండ్రోజుల కిందట వచి్చన తల్లి కొడుకును బుజ్జగించి, మళ్లీ వచ్చి తీసుకెళ్తానని నచ్చజెప్పి వెళ్లింది. ఈ క్రమంలో హాస్టల్‌ నుంచి వెళ్లిపోవాలని భావించిన గిరీశ్‌కుమార్‌ బుధవారం రాత్రి కళాశాల నుంచి మెట్ల మార్గం ద్వారా బయటకు వెళ్లాడు. విద్యార్థి కనిపించక పోవడంతో నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి తర్వాత కాలేజీ ప్రహరీ పక్కన గిరీశ్‌ మృతదేహాన్ని గురించ్తిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒంటరిగా బయటికి వచి్చన విద్యార్థి హాస్టల్‌ గోడ దూకి పారిపోయేందుకు ప్రహరీ గోడ ఎక్కాడని, గోడ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గిరీశ్‌ చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement