హైదరాబాద్: ఈ రెండు ఫొటోలను చూశారుగా! ఒకటి కేరింగ్‌కు నిదర్శనంగా నిలిస్తే,మరోటి డోంట్ కేర్.. అన్నట్టుగా ఉంది కదూ! ఒడిలో ఒద్దికగా కూర్చున్న చిన్నారికి కూడా హెల్మెట్ పెట్టి బండి మీద భద్రంగా బడికి తీసుకెళ్తున్నాడు ఓ వ్యక్తి, భద్రతకు, బాధ్యతకు ప్రతీకగా! ఒకరుకాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు పిల్లల్ని బైక్‌పై కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా తీసుకెళ్తున్నాడు మరో వ్యక్తి, బాధ్యతారాహిత్యంగా! మాదాపూర్, హిమాయత్‌నగర్‌లో కనిపించిన ఈ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.


