మాదాపూర్‌లో మరో భారీ మోసం | Huge Fraud In The Name Of Buy Back In Madhapur | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో మరో భారీ మోసం

Jun 21 2025 5:23 PM | Updated on Jun 21 2025 6:58 PM

Huge Fraud In The Name Of Buy Back In Madhapur

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్‌ పేరుతో ఏవీ ఇన్‌ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్‌ అమౌంట్‌ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్‌, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్‌ ఇవ్వకపోతే ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ హామీ ఇచ్చింది.

సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్‌ అమౌంట్‌ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement