యాదగిరిగుట్ట: కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు యాదగిరి క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాధవిధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారింది. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి.
.


