
విచారణ జరుపుతున్న సీపీ అంబర్ కిషోర్
భారీగా బంగారు ఆభరణాలు, నగదు మాయం
పరారీలో క్యాషియర్..
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కుంభకోణం జరిగింది. నగదుతోపాటు ఖాతా దారులు తనఖా పెట్టిన బంగారునగలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. క్యాషి యర్ పెద్దఎత్తున బంగారం, నగదు మాయం చేసిన ట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ మనోహర్‌రెడ్డి రెండురోజుల సెలవు తర్వాత మంగళవారం విధుల్లో చేరారు.
బ్యాంకులోని డబ్బు, ఖాతాదారులు తనఖా పెట్టిన నగల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలి సింది. దీంతో బ్యాంకు అధికారులు ఆడిటింగ్ నిర్వ హించారు. సుమారు 330 మంది ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు విలువైన బంగారు ఆభరణాలు, రూ.80 లక్షల నగ దు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు గుర్తించి పోలీసు లకు సమాచారం ఇచ్చారు.
జైపూర్ మండలం షెట్‌పల్లి గ్రామానికి చెందిన క్యాషియర్ రెండ్రోజు లుగా బ్యాంకుకు రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతోపాటు బంగారం మాయంలో కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఆడిటింగ్ శుక్రవారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యాంక్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.