హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సినీహీరో హర్షవర్ధన్‌ అరెస్ట్‌ | Hit and Run Case In Hyderabad | Sakshi
Sakshi News home page

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సినీహీరో హర్షవర్ధన్‌ అరెస్ట్‌

Jan 27 2025 7:11 AM | Updated on Jan 27 2025 7:11 AM

Hit and Run Case In Hyderabad

బంజారాహిల్స్‌: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సినీ హీరో సాధుల హర్షవర్ధన్‌తో పాటు అతడి స్నేహితుడు మాడే సాంకేత్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ తేజను బంజారాహిల్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి సమీపంలో శనివారం తెల్లవారుజామున అతి వేగంగా వచి్చన కారు ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే..నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన హర్షవర్దన్‌ సినిమా హీరోగా నటిస్తూ బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–13లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితులు మాడే సాంకేత్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ తేజ, వంశీ, రాకేష్‌తో కలిసి ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగిన రాకేష్‌ తనను పికప్‌ చేసుకోవాలని ఫోన్‌ చేయడంతో హర్షవర్ధన్‌కు చెందిన కారులో బయలుదేరిన తేజ, కార్తీక్‌ బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12 మీదుగా వేగంగా దూసుకెళ్తూ హిట్‌ అండ్‌ రన్‌కు పాల్పడ్డారు.

 తేజ కారు నడుపుతుండగా, కార్తీక్‌ పక్కన కూర్చున్నాడు. ఈ ఘటనతో భయాందోళనకు లోనైన తేజ, కార్తీక్‌తో పాటు గదిలో ఉన్న హర్షవర్ధన్, వంశీ తదితరులు కూడా పరారయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా మిస్టరీ వీడింది. కారు హర్షవర్దన్‌ది కాగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా తేజ కారు నడిపి ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో కారు ఇచి్చన హర్షవర్ధన్‌తో పాటు నడిపిన తేజపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఎం రాఘవేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement