Heavy Rains Lash Hyderabad Once Again - Sakshi
Sakshi News home page

Hyderabad: ఒక్కసారిగా మారిన వాతావరణం.. నగరంలో భారీ వర్షం

Sep 6 2022 3:16 PM | Updated on Oct 12 2022 9:04 PM

Heavy Rains Lash Hyderabad Once Again - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. 

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మల్కాజ్‌గిరి, మాదాపూర్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి, చందానగర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement