నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు: కవిత | Have Not Received Any Notice From ED Clarifies MLC Kavitha | Sakshi
Sakshi News home page

నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు: కవిత

Published Sat, Sep 17 2022 2:19 AM | Last Updated on Sat, Sep 17 2022 8:42 AM

Have Not Received Any Notice From ED Clarifies MLC Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వస్తున్న వార్త ల్లో నిజం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో వివరాలను వెల్లడించారు. కొందరు ఢిల్లీలో కూర్చుని తనపై తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఆరోపించారు.

తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. మీడియా వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని కోరారు. కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ట్వీట్‌ చేస్తున్నట్టు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement