TS: పలువురు ఐపీఎస్ అధికారుల పదోన్నతి | Government Promoted 12 IPS Officers In Telangana | Sakshi
Sakshi News home page

TS: పలువురు ఐపీఎస్ అధికారుల పదోన్నతి

Jan 22 2022 6:36 PM | Updated on Jan 22 2022 7:57 PM

Government Promoted 12 IPS Officers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు ప్రమోషన్ లభించింది. రాష్ట్రంలోని 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.1997 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐపీఎస్ అధికారులు.. విజయ్ కుమార్, నాగిరెడ్డి, డీఎస్. చోహన్‌, సంజయ్ కుమార్ జైన్‌లకు అడిషనల్ డీజీపీగా ప్రమోషన్‌ దక్కింది. 

2005 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు.. తరుణ్ జోషి, వి.శివ కుమార్‌, కమలసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్. శ్రీనివాస్‌లకు ఐజీగా పదోన్నతి లభించింది. 2008 బ్యాచ్ కు చెందిన తఫ్సర్ ఇక్బాల్‌కు డీఐజీగా, 2009 బ్యాచ్‌కు చెందిన రేమ రాజేశ్వరి, అంబారి కిషోర్ ఝాలకు సెలెక్షన్స్ గ్రేడ్ ఆఫీసర్స్ కింద ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement