టీఆర్‌ఎస్‌, ఎంఐఎం సఖ్యత: ఎప్పటివలెనె.. మమ అనిపించారు! 

GHMC Standing Committee Meeting Approves 18 Proposals - Sakshi

టీఆర్‌ఎస్, ఎంఐఎం సఖ్యతతో స్టాండింగ్‌ కమిటీ సమావేశం    

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలికి సంబంధించి తొలి స్టాండింగ్‌ కమిటీ సమావేశం అజెండాలోని 20 అంశాలకుగాను 18 అంశాలకు ఆమోదం తెలిపింది. న్యాక్‌ ద్వారా నియమించిన ఔట్‌సోర్సింగ్‌ ఇంజినీర్ల పొడిగింపు అంశాన్ని మలి సమావేశానికి వాయిదా వేశారు. మిగతా 18 ఆమోదించారు. పారిశుద్ధ్యం కార్యక్రమాల గురించి ఎక్కువ మంది ప్రస్తావించడంతో, ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అడిషనల్‌ కమిషనర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు  మేయర్‌ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. పాలసీలకు సంబంధించిన కమిటీ అయినందున తగిన విధంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులను కోరారు.

మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణాలకు, నాలాల మరమ్మతులకు అవసరమైన భూసేకరణల్లో కార్పొరేటర్లు  సహకరించాలని కోరారు. సమావేశంలో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ లోకేశ్‌కుమార్,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆమోదించిన అంశాల్లో లీచెట్‌ ట్రీట్‌మెంట్, మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం, స్విమ్మింగ్‌పూల్‌ పనులు, యానిమల్‌ క్రెమెటోరియం, నాంపల్లి సరాయి వద్ద మహిళా యాత్రికులకు వసతిగృహం తదితరాలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top