breaking news
standing comitte meeting
-
టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యత: ఎప్పటివలెనె.. మమ అనిపించారు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి సంబంధించి తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం అజెండాలోని 20 అంశాలకుగాను 18 అంశాలకు ఆమోదం తెలిపింది. న్యాక్ ద్వారా నియమించిన ఔట్సోర్సింగ్ ఇంజినీర్ల పొడిగింపు అంశాన్ని మలి సమావేశానికి వాయిదా వేశారు. మిగతా 18 ఆమోదించారు. పారిశుద్ధ్యం కార్యక్రమాల గురించి ఎక్కువ మంది ప్రస్తావించడంతో, ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అడిషనల్ కమిషనర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. పాలసీలకు సంబంధించిన కమిటీ అయినందున తగిన విధంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులను కోరారు. మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణాలకు, నాలాల మరమ్మతులకు అవసరమైన భూసేకరణల్లో కార్పొరేటర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆమోదించిన అంశాల్లో లీచెట్ ట్రీట్మెంట్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, స్విమ్మింగ్‌పూల్ పనులు, యానిమల్ క్రెమెటోరియం, నాంపల్లి సరాయి వద్ద మహిళా యాత్రికులకు వసతిగృహం తదితరాలు ఉన్నాయి. -
29, 30 తేదీల్లో స్థాయి సంఘాల సమావేశాలు
హన్మకొండ : జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ఈ నెల 29, 30 తేదీల్లో జరుగుతాయని జెడ్పీ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్ తెలిపారు. 29న 2,3, 4, 5, 6, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరుగుతాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 30న ఒకటో స్థాయి సంఘం సమావేశం జరుగుతుందని వివరించారు. సభ్యులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. స్థాయి సంఘాల సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించారు.