రాడిసన్‌ డ్రగ్స్‌ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్‌ పెడ్లర్‌ అరె​స్ట్‌ | Gachibowli Radisson Drugs Case: Another drug peddler arrested | Sakshi
Sakshi News home page

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్‌ పెడ్లర్‌ అరె​స్ట్‌

Mar 20 2024 6:41 PM | Updated on Mar 20 2024 7:52 PM

Gachibowli Radisson Drugs Case: Another drug peddler arrested - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్‌  డీసీపీ వినీత్‌ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే  ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ‘వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్‌లో విక్రయిస్తున్నారు. హైదరబాద్‌లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్‌ను టార్గెట్  చేసుకుని డ్రగ్స్ విక్రయించారు.

హైదరబాద్‌తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్‌పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్‌పేట్‌, చాదర్ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్‌లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్‌లో పనిచేస్తాడు.

డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్‌ను పిటీ వారింట్‌పై హైదరాబాద్‌కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్‌తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ వినీత్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement