హైకోర్టులో ఉచిత దంత, కంటి చికిత్స శిబిరం

Free Dental And Eye Treatment Camp At Telangana High Court - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైకోర్టు అడ్వొకేట్‌ అసోసియేషన్, రోహిణి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత చికిత్స శిబిరాన్ని మంగళవారం హైకోర్టులో నిర్వహించారు. ఈ శిబిరాన్ని జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ప్రారంభించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు న్యాయవాదులు కంటి, దంత చికిత్సతో పాటు మధుమేహ (షుగర్‌), రక్తపోటు (బీపీ)కు ఉచిత పరీక్షలు చేయించుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top