HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు | Former Director Shiva Balakrishna Suspended By HMDA | Sakshi
Sakshi News home page

HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు

Jan 30 2024 8:07 PM | Updated on Jan 30 2024 8:27 PM

Former Director Shiva Balakrishna Suspended By HMDA - Sakshi

శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ..

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్‌ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తోంది.

చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement