Massive Fire Accident In Lee Pharma Company At Sangareddy District - Sakshi
Sakshi News home page

సంగారెడ్డి: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికులకు గాయాలు!

Feb 8 2023 1:23 PM | Updated on Feb 8 2023 3:33 PM

Fire Accident In Lee Pharma Company At Sangareddy District - Sakshi

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. గడ్డిపోతారం ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలో ఉన్న లీ ఫార్మా కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో, పరిశ్రమలో ఉన్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు స్థానికులు, కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement