15 రోజులు.. 6.51లక్షల మంది శ్రమదానం

Fifth Edition Of Palle Pragathi Takes Off In Telangana - Sakshi

ముగిసిన పల్లె ప్రగతి 

సాక్షి,హైదరాబాద్‌: పల్లెల్లో సైతం పట్టణ సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి (ఐదో విడత) కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా 12,769 గ్రామపంచాయతీలలో ప్రజలను భాగస్వా మ్యం చేస్తూ వివిధ కమిటీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు అభివృద్ధి పనుల్లో 6.51 లక్షలమంది శ్రమదానం చేసినట్లు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తాని యా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని 63 వేల కి.మీ. పొడవైన రోడ్లను, 36 వేల కి.మీ.పొడవైన మురుగు కాల్వలు, 80,405 సంస్థలను పరిశుభ్రం చేసినట్లు వెల్లడిం చారు. 19,349 లోతట్టు ప్రాంతాలు, 1,098 పనికి రాని బోరుబావులు, 1,902 నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చి వేయగా.. అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం 10,946 కి.మీ రోడ్లు గుర్తించడంతో పాటు 17,710 విద్యుత్‌ స్తంభాలకు మూడో వైరును, 1,206 విద్యుత్తు మీటర్లు సమకూర్చినట్లు తెలిపారు. మొత్తం 15 రోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 8,286 మంది, రాష్ట్రస్థాయి అధికారులు 10,012 పాల్గొన్నారని వివరించారు. 

‘ప్రగతి’సోపానాలివే...: పల్లె ప్రగతిలో ఇప్పటివ రకు రూ.116 కోట్లతో 19,472 పల్లె ప్రకృతి వనాలు, రూ.1,555 కోట్లతో 12,669 వైకుంఠధా మాలు, రూ.318 కోట్లతో 12,753 డంపింగ్‌ యార్డులు నిర్మించినట్లు సుల్తాని యా తెలిపారు. 2019 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు రూ.9,800 కోట్ల మేర గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటు మంజూరు చేయగా..గ్రామాల్లో అభివృద్ధి కార్య క్రమాల నిమిత్తం ప్రతీనెల రూ.256.66 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

545 గ్రామీణ మండలాల్లో మండలానికి ఐదు చొప్పున 5 నుంచి 10 ఎకరాల్లో 2,725 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, వీటిలో 594 బృహత్‌ వనాలు ఏర్పాటు కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top