కారులో మహిళలను వెంబడించిన పోకిరీలు | |Family Chased by Bike Borne Miscreants in Hyd | Sakshi
Sakshi News home page

కారులో మహిళలను వెంబడించిన పోకిరీలు

Jun 30 2026 8:02 AM | Updated on Jun 30 2026 9:01 AM

|Family Chased by Bike Borne Miscreants in Hyd

హైదరాబాద్‌: కార్లలో వెళ్తున్న మహిళలను పోకిరీలు వెంబండించి భయాందోళనకు గురిచేశారు. కార్‌ డ్యాష్‌ క్యామ్‌లో రికార్డ్‌ అయిన ఈ దృశ్యాలను ఓ యువతి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం ఓ ఫంక్షన్‌కు వెళ్లి ఘట్‌కేసర్‌ నుంచి వరంగల్‌ జాతీయ రహదారి మీదుగా కారులో తిరిగి వస్తోంది.

 ఆ సమయంలో కొందరు వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వెంబడించారు. దీంతో కారులో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ వద్ద ఫ్లైఓవర్‌ దాటుతుండగా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ కారు డ్యాష్‌ క్యామ్‌లో రికార్డయ్యాయి.  పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.    

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement