హనుమాన్‌ టెంపుల్‌ హుండీలో నకిలీ నోట్ల కలకలం! | Fake Notes Hanuman temple Donation Box In Telangana at Kharmanghat | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ టెంపుల్‌ హుండీలో నకిలీ నోట్ల కలకలం!

Mar 23 2026 5:49 PM | Updated on Mar 23 2026 6:02 PM

Fake Notes Hanuman temple Donation Box  In Telangana at Kharmanghat

సాక్షి,  హైదరాబాద్:- కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది.

“Childrens Bank” పేరుతో   ఉన్న రూ. 100, 200, 500  నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement