
వికారాబాద్: 15 రోజుల్లో కొత్త పింఛన్లుమంజూరు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సోమవారం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోయామని, త్వరలోనే అర్హులకు పింఛన్లు ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కొత్తగా 10 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తామని, ఒక్కో జెడ్పీటీసీకి రూ. 15 లక్షల నిధులు ఇస్తామని చెప్పారు.