తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎర్రబెల్లి  | Errabelli Dayakar Rao Appeal To Make The Mahadharna Success | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎర్రబెల్లి 

Nov 12 2021 3:17 AM | Updated on Nov 12 2021 3:17 AM

Errabelli Dayakar Rao Appeal To Make The Mahadharna Success - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో వివక్ష చూపుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు ఆరోపించారు. దేశం గర్వించే ప్రాజెక్టులను నిర్మిస్తే కేంద్రం రూపాయి సాయం చేయకపోగా, తెలంగాణ విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

గురువారం సాయంత్రం హనుమకొండలోని ఆయన స్వగృహంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మంత్రి మాట్లాడారు. నూతన రైతు బిల్లులు రాష్ట్రంలో అమలు చేయకపోవడంతోనే కేంద్రం కక్ష కట్టిందన్నారు. ఇప్పటిౖనా అసలు వడ్లు కొంటరా..? కొనరా..? సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే మహాధర్నాలో రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement