నేడు ఈఏపీ సెట్‌ ఫలితాలు | Sakshi
Sakshi News home page

నేడు ఈఏపీ సెట్‌ ఫలితాలు

Published Sat, May 18 2024 6:03 AM

EAP cet results on May 18th

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సాక్షి ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడొచ్చు. కాగా, ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్‌ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement