
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. జూనియర్ కా లేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ సెలవులు ఉంటాయి.
దసరా సెలవు ల్లో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దసరా సెలవుల్లో అవసరమైన పునఃశ్చరణకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతీ విద్యారి్థకి కొంత హోం వర్క్ ఇవ్వాలని స్పష్టం చేసింది.