సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్: దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పర్యాటక అధికారులకు సూచనలు చేశారు. పురానాపూల్, హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోని ముఖ్యాంశాలు
⇒ తారామతి బారామతిని టూరిజం ప్లేస్‌గా మరింతగా అభివృద్ధి చేయాలి
⇒ మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించాలి
⇒ టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలి
⇒ వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి.. యాదాద్రి తరహాలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలి
⇒ క్యూర్ పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలి
⇒ గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్క్‌లు తీర్చిదిద్దాలి
⇒ ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది.. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలి
⇒ అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను నియమంచి పనులను ముమ్మరం చేయాలి
⇒ డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు కసరత్తు ప్రారంభించాలి
⇒ సమ్మిట్ కోసం డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి
చదవండి: హైదరాబాద్ మహా నగరానికి నయా దిశ
రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో… pic.twitter.com/fnfn5cBUrM
— Telangana CMO (@TelanganaCMO) July 6, 2026


