‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది’

Death Threat From Mynampally BJP Moulali Corporator Complaint To Women Commission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనకు, తన భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ప్రాణహాని ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ మౌలాలి కార్పొరేటర్‌ సునీతాశేఖర్‌ యాదవ్‌ ఫిర్యాదు చేశారు. ‘నేను కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి మాపై దాడులకు పాల్పడుతున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌ అభివృద్ధి కార్యక్రమాలకు నాకు సమాచారం ఇవ్వ కుండా ఓడిపోయిన కార్పొరేటర్‌ భర్తతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. మున్సి పల్‌ అధికారులు కూడా మాకు సమాచారం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు.

తన క్యారెక్టర్‌పై నిందలు మోపుతూ, ఎమ్మెల్యే అనుచరులతో, ఆడవాళ్లతో అసభ్యంగా తిట్టిస్తూ వీడియోలు పెట్టి సోషల్‌మీడియాలో వైరల్‌ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తిట్టిన మహిళలపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన అనుచ రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరా రు. మల్కాజ్‌గిరి పోలీస్‌ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని అందువల్లే సాటి మహిళగా తనకు న్యాయం చేస్తారని మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు.

ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఇతర నేతలతో కలిసి సునీతా శేఖర్‌ శనివారం వినతిపత్రం అందించారు. దీంతోపాటు తన బెదిరింపులకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఇచ్చారు. గతేడా ది ఆగస్టు 15న తన సహచర కార్పొరేటర్‌ శ్రవణ్‌పై ఎమ్మెల్యే, అనుచరులు భౌతికదాడు లకు పాల్పడిన ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినని సునీతాశేఖర్‌ పేర్కొన్నారు.   
చదవండి: తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top