తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు | Telangana Weather Forecast Rainfall On Sunday And Monday | Sakshi
Sakshi News home page

Telangana Weather Forecast: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు

Jun 19 2022 11:58 AM | Updated on Jun 19 2022 3:58 PM

Telangana Weather Forecast Rainfall On Sunday And Monday - Sakshi

ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్టు పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు విస్తరించినట్లు తెలిపింది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉందని స్పష్టం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement