ఫోన్‌  చేసి బెదిరింపులు.. దూషణలు | Dasoju Sravan Kumar Fires On Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఫోన్‌  చేసి బెదిరింపులు.. దూషణలు

Jul 15 2023 2:28 AM | Updated on Jul 15 2023 5:01 PM

Dasoju Sravan Kumar Fires On Revanth Reddy - Sakshi

ఫోన్‌  చేసి బెదిరింపులు.. దూషణలు

పోలీసులకు బీఆర్‌ఎస్‌ నగర ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ ఫిర్యాదు

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): తనకు కొద్దిరోజులుగా కొందరు ఫోన్‌ చేస్తూ బెదిరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని సైతం ఫోన్‌లో దుర్భాషలాడుతున్నారని తెలిపారు. వారంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరులని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం డీసీపీ స్నేహమెహ్రాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 24గంటల విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించానన్నారు.

ఈ స్పందనపై రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులు అర్థరాత్రి వేళ తనకు ఫోన్‌ చేసి అసభ్యంగా దూషిస్తున్నారని..  కుటుంబ సభ్యుల్ని కూడా దుర్భాషలాడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ తండ్రి వయసున్న కేసీఆర్‌ను పట్టుకొని చార్లెస్‌ శోభరాజ్‌ అనవచ్చా?.. ఇష్టమొచ్చినట్లు సీఎంను దూషిస్తుంటే ఏమీ అనొద్దా..? అని ప్రశ్నించారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతూ మరో నయీమ్‌లా మారారని శ్రవణ్‌ విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement