తెలుగు వర్సిటీలో సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం 26న  | Cultural Award Ceremony In Telugu University On 26th August | Sakshi
Sakshi News home page

తెలుగు వర్సిటీలో సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం 26న 

Aug 24 2022 1:21 AM | Updated on Aug 24 2022 9:47 AM

Cultural Award Ceremony In Telugu University On 26th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 26వ తేదీన సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సాహితీ, సంస్కృతుల వ్యాప్తికి దేశవిదేశాల్లో సేవలందించిన వారికి ఏటా ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా ఈ ఏడాది చెన్నైకి చెందిన ప్రొఫెసర్‌ చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి ఈ పురస్కారాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌తో అందిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పురస్కార ప్రదానోత్సవం గవర్నర్‌తో జరుగుతుందని పేర్కొన్నప్పటికీ.. ఆమె పేరును ప్రస్తావించడకపోవడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
Advertisement