తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే? | Coronavirus: 4393 New Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Jan 22 2022 8:12 PM | Updated on Jan 22 2022 8:12 PM

Coronavirus: 4393 New Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,393 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 2,319 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 31,199 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,95,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 4,071 మంది బాధితులు మృతి చెందారు.
 

Advertisement
 
Advertisement
Advertisement