కరోనా: తెలంగాణలో కొత్తగా 3,603 పాజిటివ్ కేసులు | Coronavirus: 3603 Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

కరోనా: తెలంగాణలో కొత్తగా 3,603 పాజిటివ్ కేసులు

Jan 23 2022 8:28 PM | Updated on Jan 23 2022 8:28 PM

Coronavirus: 3603 Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,603 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,707 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.

ప్రస్తుతం 32,094 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,34,815కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,98,649 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 4,072 మంది బాధితులు మృతి చెందారు.

చదవండి: మరణించాక రూ.కోట్ల భూమి కలిసొచ్చింది..!

Advertisement
 
Advertisement
Advertisement