కరోనా టెర్రర్‌ : ఆ జిల్లాలో​ ఒక్కరోజే 304 మందికి కరోనా పాజిటివ్‌..

Corona Virus Rapid Spread Started Again In Nalgonda - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌ (నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304మంది మహమ్మారి బారిన పడినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆయా మండలాల పరిధిలో నమోదైన కేసుల వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలంలో 9మందికి, జాజిరెడ్డిగూడెం మండలంలో ముగ్గురికి, కట్టంగూర్‌లో ఆరుగురికి, త్రిపురారం మండలంలో ఐదుగురికి, వలిగొండ మండలంలో 20మందికి, మిర్యాలగూడలో 34మందికి, గుండాల మండలంలో 9మందికి, తిరుమలగిరిలో ఐదుగురికి, చౌటుప్పల్‌లో 17మందికి, భువనగిరిలో 15మందికి, అడవిదేవులపల్లిలో 8మందికి, దేవరకొండలో ఆరుగురికి, కేతేపల్లిలో 9మందికి, ఆలేరులో ఆరుగురికి, యాదగిరిగుట్ట మండలంలో ముగ్గురికి, చిట్యాల మండలంలో నలుగురికి, నడిగూడెం మండలంలో ఒకరికి, శాలిగౌరారం మండలంలో 18మందికి, మోత్కూరులో 9మందికి, నాగార్జునసాగర్‌లో 19మందికి, డిండిలో 11మందికి, రాజాపేటలో నలుగురికి, మోతెలో 10, తుంగతుర్తిలో 8మందికి, బొమ్మలరామారం మండలంలో ఆరుగురికి, నకిరేకల్‌లో 35మందికి, సంస్థాన్‌నారాయణపురంలో ఇద్దరికి, నాంపల్లి మండలంలో నలుగురికి, అడ్డగూడూరులో ఒకరికి, మునుగోడులో 17మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

కరోనాతో నలుగురి మృతి
అర్వపల్లి: కరోనా మహమ్మారి సోకిన నలుగురు మృతిచెందారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. జాజారెడ్డిగూడెం మండలం  కాసర్లపహాడ్‌ గ్రామంలో కరోనాతో 55 ఏళ్ల వృద్ధురాలు సోమవారం మృతిచెందింది. ఆమె అంతిమ సంస్కారాన్ని స్వేరో సంస్థ ఆధ్వర్యంలో టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి మచ్చ నర్సయ్యతో పాటు మరి కొందరు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దబ్బేటి జ్యోతిరాణి, డాక్టర్‌ రాజేష్, సుజాత, ఎల్లమ్మ, సైదులు, శ్రీనివాస్, భిక్షం పాల్గొన్నారు.

తిరుమలగిరిలో ఒకరు..
తిరుమలగిరి మున్సిపాలిటీ పరి­ధిలోని మూల రాంరెడ్డి (73)కి ఇటీవల వైరస్‌ సోకింది. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందు­తూ మృతిచెందాడు. సోమవారం స్వగ్రామంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.  

నాగారంలో వృద్ధుడు..
మండల కేంద్రానికి చెందిన తజ్జం కృష్ణమూర్తి(59) మూత్రపిండాల వ్యా«ధితో బాధపడు తూ  వారంరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. రెండురోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు  గురి­కావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ  వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. కృష్ణమూర్తి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

నకిరేకల్‌లో ఆర్‌ఎంపీ..
మండలంలోని నోముల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ బుడిదపాటి రామిరెడ్డి(57)కి ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది.  ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఉదయం  అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. రామిరెడ్డి మతదేహాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్‌ సందర్శించి సంతాపం తెలిపి నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్‌రెడ్డి,  సామ రవీందర్, రాచకొండ లింగయ్య, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

చదవండి: పోస్ట్‌ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్‌ ఆర్‌థ్రాల్జియా’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-06-2021
Jun 15, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు....
15-06-2021
Jun 15, 2021, 05:09 IST
తిరుపతి తుడా: కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యమే సగం బలం అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం...
15-06-2021
Jun 15, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఎక్కువగా డబుల్‌ మ్యూటెంట్లదే కీలకపాత్ర అని తాజా అధ్యయనంలో తేలింది. మొదటి...
14-06-2021
Jun 14, 2021, 19:23 IST
వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు  ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను...
14-06-2021
Jun 14, 2021, 17:35 IST
సాక్షి,ఛండీగఢ్‌‌: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఊపిరాడక తమ కళ్లముందే ఆత్మీయులు విలవిల్లాడుతోంటే కుటుంబ సభ్యుల ఆవేదన...
14-06-2021
Jun 14, 2021, 16:07 IST
లండన్‌: కరోనా సోకిందా లేదా కనుగొనే పద్ధతిని మరింత వేగవంతం చేయడానికి ఓ పరికరాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. దీని సాయంతో కరోనా...
14-06-2021
Jun 14, 2021, 15:10 IST
సాక్షి, విజయవాడ : ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి...
14-06-2021
Jun 14, 2021, 15:03 IST
గుజరాతీ జానపద గాయని గీతా రాబరి ఇంట్లోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఉదంతం వివాదాస్పదంగా మారింది. కచ్‌ జిల్లా మాదాపర్‌...
14-06-2021
Jun 14, 2021, 14:18 IST
సాక్షి,  హైదరాబాద్‌: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత  కూడా జూన్‌ 10న తాను కోవిడ్‌-19...
14-06-2021
Jun 14, 2021, 14:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రళయం కొనసాగుతున్న వేళ.. కొవిడ్‌ కోరలను విరిచి వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మరో వ్యాక్సిన్‌ అతి...
14-06-2021
Jun 14, 2021, 12:33 IST
ప్రధాని మోదీ ప్రకటించిన నూతన విధానం ప్రకారం కోవిడ్‌ వ్యాక్సిన్ల సేకరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని దేశవ్యాప్తంగా పలు...
14-06-2021
Jun 14, 2021, 12:09 IST
బెంగళూరు: సమాజంలో గత ఏడాది కాలంగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది....
14-06-2021
Jun 14, 2021, 09:56 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24...
14-06-2021
Jun 14, 2021, 09:13 IST
తండ్రి ఓ గుమస్తా.. కుమారుడు బంధువుల సహకారంతో ఓ దుకాణం నడిపిస్తున్నాడు. వీరిద్దరి పనులతో వారి కుటుంబం సాఫీగా సాగుతోంది....
14-06-2021
Jun 14, 2021, 09:03 IST
న్యూఢిల్లీ: దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది....
14-06-2021
Jun 14, 2021, 08:34 IST
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేవారు కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరంలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గంటల...
14-06-2021
Jun 14, 2021, 07:45 IST
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్‌ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది....
14-06-2021
Jun 14, 2021, 03:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకాలు వేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గడచిన 6 రోజుల్లో 3,19,699...
13-06-2021
Jun 13, 2021, 20:41 IST
‘కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్‌ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి.
13-06-2021
Jun 13, 2021, 19:58 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ ఉధృతి  కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top