
బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరమ్మ చీరలు
పొదుపు సంఘాల మహిళలకు అందజేసేందుకు ఏర్పాట్లు
అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక పేరిట పంపిణీ
షాద్‌నగర్: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి పేరిట అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారిగా బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.
సభ్యత్వం ఉన్న మహిళలకు పంపిణీ
గత ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేవారు. రేష నాకార్డులో పేరు ఉన్న 18 ఏళ్లు నిండిన మహి ళలకు వివిధ రంగుల్లో చీరలను అందించారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్న ప్రతీ సభ్యురాలికి దసరా కానుకగా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి మహిళా సంఘాల సభ్యులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంతన్న కానుకగా ప్రతీ సంఘం సభ్యులకు చీరలను అందించనున్నారు. అయితే బతుకమ్మ పండగకు ముందుగా ఒక చీర ఆ తర్వాత రెండు నెలలకు మరో చీరను పంపిణీ చేయనున్నారు.
ఒక్కో చీరకు రూ.800
గతాని కంటే భిన్నంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను తయారు చేయించిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.800 ఖర్చు అయిందని అధికారులు తెలి పారు. జిల్లాకు ఇప్పటి వరకు 1.55 లక్షల చీరలు వచ్చాయని వీటిని సర్ధార్ నగర్ , కందు కూరు మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లో నిల్వ ఉంచామని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్నారు.
అర్హుల గుర్తింపు
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శలు, సీసీలు, గ్రామ సంఘం అధ్యక్షుడు, వీఓఏలు అర్హులను ఎంపిక చేసి అనంతరం చీరలను పంపిణీ చేయ నున్నారు. మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందికి, గ్రామ స్థాయిలో ఐకేపీ సిబ్బందికి చీరల పంపిణీ బాధ్యతలను అప్పగించనున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు
దసరా కానుకగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు బతుకమ్మ చీరలను అం దజేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు ఇప్పటి వరకు 1,55 లక్షల చీరలు వచ్చాయి. వీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.
శ్రీలత, డీఆర్డీఏ పీడీ