Sakshi News home page

సచివాలయ ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌.. ఉత్తర్వులు జారీ

Published Sun, Apr 30 2023 7:09 PM

CM KCR Signed Contract Employees Regularisation File Issues Order - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. నూతన సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవం వేళ కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఎంతోకాలంగా రెగ్యులరైజ్‌ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైంది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.
చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్‌

ప్రభుత్వం నిర్ణయంతో 2,909 మంది జూనియర్‌ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్‌), 390 మంది పాలిటెక్నిక్‌, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్‌ వ్యంగ్యాస్త్రాలు

నూతన సచివాలయంలోని తన  ఛాంబర్‌లో సీఎం కేసీఆర్‌ సంతకాలు చేసిన ఫైళ్ల వివరాలు..
1. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలుమీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు.

2. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద నూతన సచివాలయంలో సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

3. పోడుభూముల పట్టాల పంపిణీ కి సంబంధించిన ఫైలుమీద కేసీఆర్‌ సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు .

సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద కేసీఆర్ సంతకం చేశారు.

5. గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకంచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ జరుగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్న నేపథ్యంలో 6.84 లక్షల మంది గర్భిణిలు లబ్ధి పొందనున్నారు. కాగా ఒక్కో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ రెండు వేల రూపాయలు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది.

6.  పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement