హైదరాబాద్: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తనకు ఇచ్చిన నోటీసుకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆగస్టు 16న చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
‘‘ఏఐసీసీ, టీపీసీసీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావించాను. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే నాకు దేవుళ్లతో సమానం. అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదు, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు.
ఈ రెండేళ్ల 8 నెలల్లో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనుభవిస్తున్న బాధలు చెప్పాను. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న నాయకుల మనోభావాలను వ్యక్త పరిచాను. ఎవరిపైనా అనుచిత వాఖ్యలు చేయలేదు. నాకు ఆ అలవాటు, అవసరం లేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని చిన్నారెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: ‘సీఎం రేవంత్ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు’


