చార్మినార్‌లో కనీస సౌకర్యాలు కరువు | Charminar lacks basic amenities | Sakshi
Sakshi News home page

చార్మినార్‌లో కనీస సౌకర్యాలు కరువు

Jan 6 2024 11:03 AM | Updated on Jan 6 2024 11:03 AM

Charminar lacks basic amenities - Sakshi

హైదరాబాద్: చార్మినార్‌ చూసేందుకు వచ్చన సందర్శకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో పర్యాటకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి తాగునీటితో పాటు బ్యాగులు ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు క్లాక్‌రూంలు అందుబాటులో లేవు. భద్రతాచర్యల దృష్ట్యా చార్మినార్‌కట్టడంలోని బ్యాగ్‌లతో పాటు ఇతర వస్తువులను  అనుమతించరు. దీంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

► రోజూ సందర్శకుల ద్వారా వస్తున్న ఆదాయం రోజురోజుకు పెరుగుతున్నా.. సందర్శకులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లభించడం లేదనే విమర్శలున్నాయి. 
► వీకెండ్‌లలో పర్యాటకుల సంఖ్య రోజుకు 5 వేల నుంచి 6 వేలకు పైగా ఉంటుండటంతో వారి ద్వారా ఏఎస్‌ఐకు దాదాపు రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. రోజుకు లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని ప్రశ్నిస్తున్నారు.  

ఆదాయంపై ఉన్న శ్రద్ధ... 
దేశ విదేశాల నుంచి చార్మినార్‌ కట్టడాన్ని సందర్శించే పర్యాటకుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపట్టడానికి పురాతత్వశాఖ (ఏఎస్‌ఐ– ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) అధికారులు ఆసక్తి చూపడం లేదని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధ సౌకర్యాల ఏర్పాటులో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మినార్‌ల కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ పనులు.. 
మినార్‌లకు కేవలం కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ పనులు మాత్రమే చేపడుతున్నారని సందర్శకులకు అవసరమైన సౌకర్యాల పట్ల ఏమాత్రం దృష్టి సారించడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారి్మనార్‌ కట్టడంలో సందర్శకులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. కట్టడంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని పలువురు వాపోతున్నారు.  

రిమోట్‌ ప్రెసెంస్‌ కియోస్కీని ఏర్పాటు చేయాలి.. 
చారి్మనార్‌ కట్టడంలో గతంలో ఏర్పాటు చేసిన రిమోట్‌ ప్రెసెంస్‌ కియోస్కీ ప్రస్తుతం కనుమరుగైంది. మక్కా మసీదు, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు, యునాని, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్‌ తదితర పురాత న కట్టడాలను దగ్గరగా కనులారా తిలకించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2002 జూన్‌ 8న చార్మినార్‌ కట్టడంలోని ఒక చోట చార్మినార్‌ రిమోట్‌ ప్రెసెంస్‌ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. 

రూ.28 లక్షల వ్యయంతో.. 
దాదాపు రూ. 28 లక్షల రూపాయల వ్యయంతో పురాతన కట్టడాలను దూరంగా ఉన్నవాటిని దగ్గరగా చూసేందుకు  చార్మినార్‌ కట్టడంలో రిమోట్‌ ప్రెసెంస్‌ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. దీనికోసం చారి్మనార్‌ పైభాగంలో నాలుగు కెమెరాలను అమర్చారు. కొన్నేళ్ల పాటు రెండు కెమెరాలు పనిచేయకుండా పోయాయి. మిగిలిన రెండు కెమెరాల ద్వారా సందర్శకులు చార్మినార్, మక్కామసీద్, ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లను తిలకిస్తున్నారు. ప్రస్తుతం అవి కూడా పనిచేయడం లేదని సమాచారం. టచ్‌ స్క్రీన్‌ ఆనవాళ్లు కూడా చారి్మనార్‌ కట్టడంలో కనిపించకుండా పోయాయి. పనిచేయని రిమోట్‌ ప్రెసెంస్‌ కియోస్కీ టచ్ర్‌స్కీన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement