బీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య

Published Thu, May 23 2024 9:13 AM

BRS Sridhar Reddy Killed At Kollapur

సాక్షి, కొల్లాపూర్‌: తెలంగాణలో ఎన్నికల వేళ దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.

వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రధాన నేత శ్రీధర్‌ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కాగా, శ్రీధర్‌ రెడ్డి బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి హత్య చేశారు. ఇక, శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు.

ఈ హత్య కేసు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, శ్రీధర్‌ రెడ్డి హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement