మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్‌ | BRS KCR Sad Over Maganti Gopinath Tribute | Sakshi
Sakshi News home page

మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్‌

Jun 8 2025 12:00 PM | Updated on Jun 8 2025 3:15 PM

BRS KCR Sad Over Maganti Gopinath Tribute

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మాగంటి మృతదేహానికి నివాళి అర్పించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. 

కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. మాగంటి గోపీనాథ్‌ ఇంటికి చేరుకున్నారు. అనంతరం, మాగంటి భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురైన పెద్దాయన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటి కుమారుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement