మోరంచ వాగులో చిక్కుకున్న కార్మికులు

Bridge workers struck in Morancha Vaagu - Sakshi

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లికి సమీపంలో ఉన్న మోరంచ వాగులో బ్రిడ్జ్ నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. గుడాడుపల్లి(ఎస్ యం), కొత్తపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు, ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో మోరంచ వాగులో ఇరుక్కుపోయారు. (వరదల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి)

వరద ఉధృతి పెరుగుతుండటంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు. కూలీలను రక్షించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, సహాయం కోసం రెస్క్యూ టీమ్‌ను పంపించాలని కోరారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top