పొగచూరిన కోతి! | black Monkeys In nalgonda | Sakshi
Sakshi News home page

పొగచూరిన కోతి!

Jun 8 2025 10:03 AM | Updated on Jun 8 2025 10:03 AM

 black Monkeys In nalgonda

టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీల పొగతో నల్లగా మారిన వానరం

మోటకొండూర్‌(నల్గొండ): మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద టైర్ల రీసైక్లింగ్‌కు సంబంధించి రెండు కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక కంపెనీ ఆరు నెలల క్రితం, మరో కంపెనీ రెండు నెలల క్రితం ఉత్పత్తులను ప్రారంభించింది. ఈ కంపెనీ ల నుంచి వస్తున్న పొగ, నల్లటి ధూళి వల్ల పంట చేలు నల్లబారుతున్నాయి. 

అంతేకాకుండా అక్కడ సంచరిస్తున్న కోతులు సైతం నలుపు రంగులోకి మారుతున్నాయి. ఈ పొగ, ధూళి ప్రజారోగ్యంపై ప్రభావం చూపకముందే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు సమీక్ష నిర్వహించి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, సాగుకు అనువుగా లేని ప్రాంతానికి కంపెనీలను తరలించేలా చూడాలని కోరుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement