ఎమ్మెల్యే రాజాసింగ్‌లో ప్రవహించేది కాషాయ రక్తమే.. 

BJP MLA Raja Singh Wife Says Husband Fight For Hindhu Virtue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంనేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ సిద్ధంగా ఉన్నారని, ఆయన భార్య టీ.ఉషాబాయి పేర్కొన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం కష్టపడి పనిచేసే రాజాసింగ్‌ అదే ధర్మం కోసం జైలు పాలయ్యారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య ఉషాభాయి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజాసింగ్‌ జైలులో ఉన్న ఈ సమయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్‌ అభిమానులంతా మాకు అండగా ఉంటూ కొండంత ధైర్యం ఇస్తున్నారని అన్నారు. రాజాసింగ్, ఆయన కుటుంబం ఎప్పుడూ అనాథ కాదని, హిందూ సమాజం అంతా మా కుటుంబానికి అండగా ఉందన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్‌ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేసేవారి పట్ల రాజాసింగ్, అభిమానులు, పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజాసింగ్‌లో ప్రవహించేది కాషాయ రక్తమే అన్నారు. రాజాసింగ్‌ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని, ఆయన చేతిలో ఉండేది కమలం జెండాయేనని ధర్మం కోసం ఆయన ఎన్ని బాధలైనా భరించడానకి సిద్ధంగా ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top