హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ ఓ స్కూటరిస్టు పెండింగ్ చలాన్లను పరిశీలించగా 42 ఉన్నట్లు తెలింది. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ సింగరేణికాలనీకి చెందిన బి.ఆనంద్‌రాజు అనే వ్యక్తి యాక్టివా బైక్‌పై బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా అక్కడే వాహనాల తనిఖీలు చేపడుతున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.
ఈ వాహనంపై 2004 నుంచి ఇప్పటి వరకు 42 పెండింగ్ చలాన్లు బయటపడ్డాయి. రూ.16,665 బకాయిపడ్డాడు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతుండగా 34 చలాన్లు నమోదయ్యాయి. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ నాలుగు సార్లు, రాంగ్‌రూట్‌లో వెళ్తూ మరో నాలుగుసార్లు కెమెరాలకు చిక్కాడు. 42 చలాన్లను చెల్లించాలని పోలీసులు కోరగా నిరాకరించాడు. దీంతో బైక్‌ను సీజ్ చేసి ఆనంద్‌రాజ్‌పై కేసు నమోదు చేశారు.


