సాక్షి మహబూబ్‌నగర్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎంపీ డీ.కే అరుణ తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.మూడు వేల కోట్ల నిధుల కోసమే ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తుందన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఇందిరమ్మ చీరలను హుటాహుటీన పంపిణీ చేసిందని తెలిపారు. వాటిని కట్టుకొని ఓటింగ్‌లో పాల్గొనాలని సీఎం రేవంత్ కోరడం ఎంతో హస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఎంపీ డీ.కే అరుణ తేల్చిచెప్పారు.


