
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాల వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు.
