హైదరాబాద్:: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. దాంతో ఎలాగైనా గెలవాలని కుయుక్తులు చేస్తోందని మండిపడ్డారు. మైనార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్‌ను మంత్రి చేయబోతున్నారని, బీఆర్‌ఎస్ కూడా బీజేపీని నిలువరించాలనే యత్నంచేస్తోందన్నారు డీకే అరుణ.
‘ఎన్నికల్లో ఓడిపోతున్నరనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో ఓడిపోతుంది. ఉపాధి కోసం వలస వచ్చిన వారే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కూడా ఒక్క పని చేయలేదు. కాంగ్రెస్ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది.
రెండేళ్లుగా మైనార్టీకి మంత్రి పదవి గుర్తు రాలేదు ఓడిపోతామని తెలిసి మంత్రి పదవి నాటకం. ఓట్ల కోసం ఏ గడ్డి తినడానికి కాంగ్రెస్ రెడీ. మోదీ కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుంటే రాష్ట్రంలో అభివృద్ధే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలే ఉంటదని ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే అంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు బీజేపీ తప్పకుండా జూబ్లీహిల్స్‌లో గెలుస్తుంది’ అని స్పష్టం చేశారు.


