వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్‌ పూర్తి | Bhadrachalam Sattupalli Railway Line By March: SCCL CMD | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్‌ పూర్తి

Feb 5 2022 2:42 AM | Updated on Feb 5 2022 2:42 AM

Bhadrachalam Sattupalli Railway Line By March: SCCL CMD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌–దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54 కిలోమీటర్ల భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్‌ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సింగరేణి డైరెక్టర్లు ఎన్‌.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ లైన్‌ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్‌పీ నిర్మాణం కూడా మార్చికల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా ఉపరితల గనుల్లో రోజూ 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను డైరెక్టర్లు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement