న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్‌ కల్పించండి | BC Leader R Krishnaiah Meets MP Kishan Reddy Over Judges Appointment | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్‌ కల్పించండి

Jul 28 2021 7:54 AM | Updated on Jul 28 2021 7:58 AM

BC Leader R Krishnaiah Meets MP Kishan Reddy Over Judges Appointment - Sakshi

కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఈమేరకు మంగళవారం కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ భగేల్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో జరిగిన న్యాయమూర్తుల నియామకాల్లో ఇప్పటివరకు 3% కంటే ఎక్కువ బీసీలకు, 2% కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు అవకాశం రాలేదన్నారు.

తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య చెప్పారు. అనంతరం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు కలిశారు. బీసీలకు సంబంధించిన డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement