బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | B Tech student Attempts To Ends Her Life In Rangareddy | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Jun 12 2025 11:57 AM | Updated on Jun 12 2025 11:57 AM

B Tech student Attempts To Ends Her Life In Rangareddy

ఇబ్రహీంపట్నం రూరల్‌(హైదరాబాద్): కడుపునొప్పి, చెవి నొప్పి భరించలేక ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం..

 ఆదిబట్ల మున్సిపాలిటీ ఎంపీపటేల్‌గూడకు చెందిన గడుసు మైత్రి (20) ఇబ్రహీంపట్నంలోని గురునా నక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, చెవినొప్పితో  బాధపడుతోంది. సరైన చికిత్స అందడం లేదని మనస్తాపానికి గురై  బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

Advertisement
 
Advertisement
Advertisement